మన దేశంలో ప్రజాస్వామ్యం, సోషలిజం కావలంటే చట్ట సభలల్లో BC లు 52 శాతం ఉండాలి. అందుకొరకు ఉద్యమించాలి.
----------
బ్రాహ్మణులు, రాజులు,వైశ్యులు, కమ్మలు, రెడ్లు, వెలమ దొరలు వాళ్ళ బానిసలు ప్రభుత్వం లో ఉండి, ప్రతి పక్షాలలో ఉండి, ఉద్యమ కారులు గా ఉండి, ఉద్యమాలు చేస్తూ ప్రజాస్వామ్యం, సోషలిజన్ని సాధించ లేకపోయారు. ఓడిపోయారు అని అనడం కన్నా ప్రజలను మోసం చేసారు అంటే సరి అయినది. 70 సంవత్సరాలు కబుర్లు చెప్పారు(తెలిసి కాని తెలియక కాని). పార్లమెంట్, అసెంబ్లీ లను కొటీశ్వర్ల క్లబ్లుగా, మార్చుకున్నారు. తయారు చేసారు. ఇది వీళ్ళు సాధించింది.
వామ పక్ష పార్టీలు వాళ్ళ ప్రజా సంఘాలు అనేక పత్రికలు నడుపుతాయి. అలాగే అంబేద్కర్ వాదులు అనేక పత్రికలు నడుపుతున్నారు. వాళ్ళ పత్రికల్ల్లో డబ్బు మద్యం, బహుమతులు పంచె వారు, వారి నాయకులు నేరస్తులు వారిని కటినంగా శిక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అని వాక్యము ఉండదు. ఉండాలని కోరిన ఉండదు. అభ్యుదయ రచయితలు మేధావులు రాయరు. చెప్పరు. ఇది రాస్తే, చెబితే వాళ్ళు చేసే ఉద్యమాలు, విప్లవాలు ఆగి పోతాయా. ఎందుకు రాయరు. ప్రశ్నలు రావా . ఏమి చేస్తున్నారు అనే ప్రశ్నలు రావా.
దీనిని బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ముందే గుర్తించారు. అందుకొరకు చట్ట సభలల్లో BC లు ఉండాలని కోరుకున్నారు. నెహ్రూ గారికి చెప్పారు. వారు వినలేదు. విసుగుపుట్టి మంత్రి పదవికి రాజీనామా చేసారు.
వారి ఆలోచనను, వారి దేశం కోసం వారి దార్శినికతను అర్ధం చేసుకోలేదు. అందులో నేను కూడ ఒకడిని.
ప్రవేటి కరణ జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వేస్తున్నారు. ప్రజాస్వామ్యం లేదు. ఇంకా సోషలిజం ఎక్కడ. రాజ్యాంగ పీఠిక ను కూడ చదవడం లేదు.
BC లు చట్ట సభలల్లో ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేదే కాదు.
విద్యా, వైద్య, వ్యవసాయా, పారిశ్రామిక రంగాలలో ఎన్నో మార్పులు వస్తాయి.
కావున చట్ట సభలల్లో BC లకు 52% ప్రాతినిధ్యం ఉండాలి.
మాకు మీరిచ్చే PM , CM , మంత్రుల MP ,MLA ల పదవులు వద్దు . మీ సేవ మాకు వద్దు.
మాకు చట్ట సభలల్లో BC లకు 52 శాతం ప్రాతినిద్యం కొరకు రాజ్యంగ సవరణ చేయాలి.
ఇది చేయండి.
దేశం మారిపోతుంది.
ప్రజాస్వామ్యం , సోషలిజం ఏర్పడుతాయి.
రాజ్యాంగం అమలు అవుతుంది.
డబ్బు, మద్యం బహుమతులు పంచె వారు, వారి నాయకులు పార్టీలు నాశనమవుతాయి.
పార్లమెంట్ , అసెంబ్లీలు శ్రమజీవులతో నిండి వుంటాయి.
BC సంఘాలు, కుల సంఘాలు. ఐక్యంగా కృషి చేయండి. ఐక్యం కాలేక పొతే సమాంతరంగా చేయండి. సాధించండి.
అందుకొరకు BC సంఘాలు, కుల సంఘాలు ఐక్యతతో ఉద్యమించాలి. సాధించాలి.
అన్ని రాజకీయ పార్టీల వద్ద ముఖ్యంగా BJP ఆఫీసుల వద్ద చట్ట సభలల్లో BC లకు 52% ప్రాతినిద్యం కొరకు రాజ్యాంగ సవరణ చేసేదాకా ప్రదర్శనలు చేయాలి. సాధించాలి.
ప్రజాస్వామ్యం, సోషలిజం కొరకు కృషి చేయాలి.
కామేశ్వరరావు
గ్రూప్ అడ్మిన్
అధ్యక్షులు
రాజ్యాంగ పరిరక్షణ వేదిక
26.3.2022
9849008986